BPT: పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్కు ఉన్న SC హోదాను రద్దు చేస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చర్చి నిర్మాణ వివాదంలో స్థానికులపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని స్థానికులు కోర్టును ఆశ్రయించగా, కేసు చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.