W.G: వేండ్ర బ్రిడ్జి వద్ద కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన మానవ తప్పిదం వల్లే జరిగిందని భీమవరం DSP రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ విక్రమ్ ఒక్కడే ఉన్నాడని, ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూసి కంగారుపడి పక్కకు తిప్పడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని, కర్వ్ దగ్గర కన్ఫూజ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.