MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ చెరువు కట్ట మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. గత వర్షాకాలం భారీ వర్షాలతో కట్టకు నష్టం వాటిల్లడంతో అధికారులు స్పందించి నిధులు మంజూరు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీజన్‌కు ముందే కట్టను బలోపేతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.