ప్రకాశం: మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 వాహనాలను గుర్తించి వాటికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉంటామని ప్రజల చేత పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.