VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సంబంధిత సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఆన్ లైన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.