WG: తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి వెంకట్రామన్నగూడెం పొలాల మధ్య పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రూరల్ పోలీసులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో శనివారం దాడి చేశారు. జూదరులు పారిపోగా, నాలుగు మోటార్ సైకిళ్లు, 53 పేక ముక్కలు, బరకం స్వాధీనం చేసుకున్నట్లు SI రవికుమార్ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.