WGL: వరంగల్ ఈ నెల 28న నిర్వహించనున్న బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో జరిపేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. శనివారం జిల్లా అధికారులతో పాటు ముస్లిం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ప్రార్థన స్థలాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని నగరపాలక అధికారులను ఆదేశించారు.