ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ అల్కరాజ్ మణికట్టు గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్(ఇటలీ)పై అందరి దృష్టి నిలిచింది. తన 25వ టైటిల్ వేటలో ఉన్న జొకోవిచ్ మరోసారి పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా తన తొలి ఫ్రెంచ్ టైటిల్‌ను సాధించాలని పట్టుదలగా ఉంది.