SRCL: వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ ఏఈ పృథ్వీధర్ గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో విద్యుత్ ట్రాన్ఫార్మర్ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. గ్రామాల్లో కరెంటు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.