అన్నమయ్య: మదనపల్లి స్థానిక డిస్కం డివిజన్ కార్యాలయంలో ఆదివారం కూడా వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గంగాధరం తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్ కార్యాలయ కౌంటర్లలో సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.