TG: సూర్యాపేట(D) కోదాడ NHపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి HYD వెళ్తున్న ‘యోలా’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.