TG: క్యూర్ పరిధిలో ప్రజా రవాణ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే క్యూర్ పరిధిలో రెండో దశ మెట్రో మార్గాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోరైలు కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.