RR: గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL కీలక చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 100 KVA డీటీఆర్ల సామర్థ్యాన్ని 160 KVAకు పెంచినట్లు అధికారులు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య, ఐటీ మౌలిక వసతులకు అంతరాయం లేని స్థిరమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమన్నారు.