TG: సీఎం రేవంత్ రెడ్డి ఇంధన పొదుపు చర్యలు పాటిస్తున్నారు. తన కాన్వాయ్‌లోని వాహనాలను రేవంత్ రెడ్డి తగ్గించుకున్నారు. నిన్న కేవలం 3 వాహనాల కాన్వాయ్‌తోనే సచివాలయానికి వచ్చారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు. జామర్ వాహనం లేకుండానే సీఎం రేవంత్ కాన్వాయ్ ఉంది. సీఎం కాన్వాయ్కి 2 వైపులా పోలీసులు టూ వీలర్స్‌పై వచ్చారు.