E.G: రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఆయనకు ఎస్పీ నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఐజీ కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును, రికార్డుల నిర్వహణను, పరిపాలనా వ్యవహారాలను పరిశీలించారు. ప్రజా భద్రత, క్రమశిక్షణతో పాటు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేలా పని చేయాలన్నారు.