AP: రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. PM ఈ-బస్ సేవా పథకంలో భాగంగా కేంద్రం వీటిని కేటాయించినట్లు చెప్పారు. విశాఖ, విజయవాడ, GNT, NLR, KNL, కాకినాడ, రాజమండ్రి, KDP, అమరావతి, TPT, అనంతపురం వంటి నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 12 డిపోలతో అనుసంధానం చేస్తూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.