AKP: నక్కపల్లి మండలంలో పలుచోట్ల శనివారం సాయంత్రం వీచిన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. దేవవరం, జగన్నాధపురం ముకుంద రాజుపేట గ్రామాల్లో విద్యుత్తు స్తంభాల పడిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పక్వానికి వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి.