ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలల సమీపంలో పాన్ షాపులు, మెడికల్ షాపుల్లో నిఘా పెంచాలని తెలిపారు. గంజాయి సాగు చేసిన వారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని ఆదేశించారు.