BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని గద్వాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు దర్శించారు. అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, సరస్వతి అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.