JN: పాలకుర్తి మండలం కేశవపట్నం, చొప్పదండి ప్రాంతాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 తులాల బంగారం, 70 తులాల వెండి వస్తువులతో పాటు కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ విలువ సుమారు రూ. 6.25 లక్షలుగా నిర్ధారించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.