NDL: శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని శనివారం ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు క్యూ లైన్లలో తాగునీరు, ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల నుంచి ఫిర్యాదులు తలెత్తకుండా చూడాలన్నారు.