TG: బక్రీద్ పండుగను ఎలాంటి గొడవలు లేకుండా, పరస్పర సహకారంతో ప్రశాంతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి సూచించారు. పండుగను సామరస్యంగా జరుపుకోవడమే సమాజ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని.. అనుమానాస్పద వాహనాలు లేదా గోవుల అక్రమ రవాణా గమనిస్తే పోలీసులకు చెప్పాలి తప్ప చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.