E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈనెల 25న జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆనం కళాకేంద్రానికి మార్చినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. నగర ప్రజలు ఈ మార్పును గమనించి ఫిర్యాదుల కోసం ఆనం కళాకేంద్రానికి రావాలని సూచించారు. తదుపరి సోమవారం (జూన్ 1) నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కార్పొరేషన్ కార్యాలయంలోనే జరుగుతుందన్నారు.