ELR: తాటియాకులగూడెంలో శనివారం చోరీ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మల్లిశెట్టి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు బీరువాలోని 2 బంగారు ఉంగరాలు, చెవి రింగులు, 12 తులాల వెండి సామగ్రి అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు