BDK: పలు ఏరియాల జీఎంలతో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓబీ, బొగ్గు బెంచీల వద్ద నీరు నిలవకుండా ప్రైవేటు పంపులు ఏర్పాటు చేయాలని, రవాణాకు వీలుగా హాల్ రోడ్లను పటిష్టపరచాలని సూచించారు.