AKP: నక్కపల్లి మండలం చినరామభద్రపురంలో శనివారం సాయంత్రం వీచిన పెనుగాలులకు కొబ్బరి చెట్టు మీద పడి వ్యక్తి మృతి చెందాడు. గ్రామ శివారు ప్రాంతంలో పశువులు మేపుతుండగా ఉదృతంగా గాలులు వీస్తుండడంతో పశువుల పాకలోకి వెళ్లాడు. ఆ సమయంలో కొబ్బరి చెట్టు పాకపై పడడంతో పాకలో తలదాచుకున్న పులి రంగబాబు(52)అక్కడికక్కడే మృతి చెందాడు. నక్కపల్లి సిఐ మురళి ఘటనా స్థలానికి వెళ్లారు.