సత్యసాయి జిల్లా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ)గా వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.