KKD: అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ Dy.EO సత్యనారాయణ శనివారం హెచ్చరించారు. ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తప్పనిసరిగా స్కూల్ నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.