SRPT: తుంగతుర్తి మండలం కొత్తగూడెం బస్టాండ్లో సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.