కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్లోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.