VZM: సంతకవిటిమండలం తలాడలో శనివారం బైకును ఆటో ఢీకోన్న ఘటనలో స్దానిక ఎస్. ఆగ్రహారంకి చెందిన నాగయ్య (55) మృతి చెందాడు. సంతకవిటి నుంచి వస్తున్న ఆటో నాగయ్య బైక్‌ని తాలాడ సమీపంలో బలంగా ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌కు తీసువెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.