HNK: నేడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. మొబైల్, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.