BHPL: చిట్యాల మండల కేంద్రంలో వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని చిట్యాల సీఐ దగ్గు మల్లేశ్ తెలిపారు. పంట వ్యర్థాలను భూమిలో కలియదున్ని సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. పంట అవశేషాల దహనం చట్టరీత్యా నేరమని ,రైతులు అవగాహనతో వ్యవహరించాలని కోరారు.