ADB: జిల్లాలో రెండవ విడత ‘జలసంచయ్-జనభాగీదారి 2.0’ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మరోసారి జిల్లాను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.