MGL: 2026-27 విద్యా సంవత్సరానికి గోవిందరావుపేట మండల తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఎంపీడీవో వరుణ్ కుమార్ తెలిపారు. టీజీఎంఎస్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందిస్తామని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతాయన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఈఏపీసెట్, నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వబడునని ఆమె అన్నారు.