KMM: వైరా, ఎన్కూరు గురుకులాల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ పోస్టుల (JL, PGT, TGT) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రిన్సిపల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు మే 25 నుంచి 27 వరకు ఎన్కూరు గురుకులంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 30న డెమోలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.