గుంటూరు రైల్వేలో మరమ్మత్తు పనుల నేపథ్యంలో మే 23, 24, 30, 31 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ వారు తెలిపారు. విజయవాడ-గుంటూరు (57201), గుంటూరు-మాచర్ల (57203), మాచర్ల-గుంటూరు (57204), గుంటూరు-విజయవాడ (57202) రైళ్లతో పాటు విజయవాడ-గుంటూరు, గుంటూరు-రేపల్లె, రేపల్లె-గుంటూరు, మార్కాపూర్ రోడ్డు-తెనాలి ప్యాసింజర్లు రద్దు అవుతున్నట్లు పేర్కొన్నారు.