KDP: గోవధ, జంతుబలుల నిషేధ చట్టాల అమలుకు జిల్లాకు నోడల్ అధికారిని నియమించినట్లు SP విశ్వనాథ్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు DGP సూచనల మేరకు జిల్లాలో ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్పను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. జంతువుల అక్రమ రవాణా,అక్రమ వధపై సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121100689కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు.