KMR: చేపల వేటకు వెళ్లి ప్రమాదశాత్తూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలంలోని చించోలి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాములు కథనం ప్రకారం.. కిష్టాపూరానికి చెందిన ముక్కిడి సాయిలు (34) చెరువులో దిగి చేపల కోసం వల వేయగా.. ఆ వల తన కాలుకు చుట్టుకుంది. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు.