ATP: పయ్యావుల సేవా సమితి ఆధ్వర్యంలో ఉరవకొండలో పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసులు, గుంతకల్ ఆర్టీవో రాజబాబు 800 మంది ద్విచక్ర వాహనదారులకు వీటిని అందజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రాణ రక్షణ చూసుకోవాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.