BPT: పర్యాటకులకు అత్యవసర చికిత్స అందించేందుకు సూర్యలంక సముద్రతీరం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్న సందర్భంగా వారికి అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.