VZM: పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టరు సేధు మాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ప్రత్యేక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జెడ్పీ కార్యాలయ సమీపంలో శ్రీకారం చుట్టారు.