శాకుంతలం
సినిమా విశేషాలు
‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ చేస్తున్న సినిమా ‘శాకుంతల’. యశోద తర్వాత సమంత నటిస్తున్న సినిమా ఇదే.
కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ రచన ఆధారంగా
ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఎస్వీసీసీ, గుణ టీమ్ వర్క్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
శకుంతల పాత్రలో సమంత.. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు.
పౌరాణిక ప్రేమ కథా ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు.
విజువల్ వండర్ గా త్రీడీ టెక్నాలజీలో సినిమా తీస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలకు సన్నాహాలు
ఈ సినిమాకు సంబంధించి టీజర్, పాటలు విడుదలవగా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సినిమా విడుదల అనేక వాయిదాలు పడుతోంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుంది..