AP: దేవుడికి కంటే ఏ వ్యక్తి గొప్పవాడు కాదని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ను తిరుమలకు వెళ్లవద్దని తాము ఏ నోటీసులు ఇవ్వలేదని.. ఒకవేళ నోటీసులు ఇస్తే చూపించాలని సవాల్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. ఏ మతంలోనైనా కొన్ని ఆచారాలు ఉంటాయని.. వాటిని పాటించాలని స్పష్టం చేశారు. హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రం అన్న చంద్రబాబు.. ఇంతకముందు చట్టాలను దిక్కరించి తిరుమలకు వెళ్లారని మండిపడ్డారు.