BDK: కొత్తగూడెంలోని ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో మాట్లాడి భోజనం నాణ్యతని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ నిర్వహణపై వార్డెన్‌కు పలు సూచనలు చేశారు. విద్యార్ధినిలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు.