TG: హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ ప్రజలను భయపెడుతుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. పేదల ఇండ్లను కూల్చివేస్తే వారు ఎక్కడ ఉండాలని నిలదీశారు. ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాడానికే సీఎం రేవంత్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ను మించిన అవినీతిపరుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.