KRNL: ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టి అనంతరం శుక్రవారం డోన్‌కు చేరుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఐటీఐ కాలేజీ నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎంఎస్ఆర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ గజమాల, టపాసులతో స్వాగతం పలికారు.