AP: తిరుమలలో డిక్లరేషన్‌పై టీటీడీ బోర్డులు వెలిశాయి. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ ప్రవేశం హిందువుల హక్కు అని..టీటీడీ ఆలయాలు హిందువులకు మాత్రమేనంటూ పేర్కొన్నారు. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలంటే ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.