ADB: పెంచికలపేట్ మండలం ఇంఛార్జ్ విద్య అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్ బాబును మండల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు ఉన్నారు.