ADB: విద్యార్థులకు పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించి, వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు కుంటాల జలపాతం విహారయాత్ర సందర్భంగా శుక్రవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి పాల్గొన్నారు.